బిగ్ బ్రేక్ కావాలంటే.. డైరెక్టర్‌తో పడుకోవాల్సిందే : దివ్యాంక త్రిపాఠి

by Disha News Desk |
బిగ్ బ్రేక్ కావాలంటే.. డైరెక్టర్‌తో పడుకోవాల్సిందే : దివ్యాంక త్రిపాఠి
X

దిశ, సినిమా : పాపులర్ టెలివిజన్ యాక్టర్ దివ్యాంకా త్రిపాఠి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో డైరెక్టర్‌తో గడిపితే బిగ్ బ్రేక్ వస్తుందని తనతో చాలా మంది చెప్పేవారని గుర్తుచేసుకుంది. 'చాన్స్‌ల కోసం అందరూ అలాగే చేస్తారు. నువ్వు చేయడంలో తప్పేమీ లేదు' అని సూచించేవారని తెలిపింది. కాని తాను మాత్రం టాలెంట్‌ను నమ్ముకునే అవకాశాల కోసం ప్రయత్నిస్తాను తప్ప డైరెక్టర్‌తో సన్నిహితంగా ఉండటం జరగదని వారికి స్పష్టం చేసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఒక షో ఫినిష్ అయిందంటే.. మరో షోలో చాన్స్ కోసం చాలా కష్టపడేవాళ్లమని, ఒకానొక టైమ్‌లో బిల్స్, ఈఎంఐలు కట్టేందుకు స్ట్రగుల్ అయ్యానని పేర్కొంది. అయినా సరే ఎప్పుడు, ఎవరి ముందు తలదించుకునే పని చేయలేదని, చేయబోనని చెప్పుకొచ్చింది దివ్యాంక.

Advertisement

Next Story

Most Viewed