- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. హౌస్‌లో విడాకులు తీసుకున్న జంట
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ 6 బీబీ అభిమానులందరినీ నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో బిగ్ బాస్7ను రసవత్తరంగా నడిపించడానికి బీబీ నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారంట. ఎలాగైనా ఈ సారి బీబీ 7 మంచి టాక్ తెచ్చుకొని హిట్ అందుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారంట. అందులో భాగంగానే ఫేమస్ యాంకర్స్‌ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపడానికి చూస్తున్నారంట. అంతే కాకుండా ఓ విడాకుల జంటను హౌస్‌లోకి పంపిచడానికి మాస్టర్ ప్లాన్ వేశారంట.
అయితే ఆ డివోర్స్ జంట ఎవరో కాదు, ఒకప్పటి టాలీవుడ్ స్టార్ సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్‌ను హౌస్‌లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని రోజులకే మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే అంత కోపతాపాలు ఉన్నాయి. ఎస్తేరు చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలలో నోయల్ పై దారుణ కామెంట్లు చేసింది. ఇలాంటి వీరిని హౌస్‌లోకి పంపిస్తే ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.