విడాకుల వార్తలు.. నేనే అధికారిక ప్రకటన విడుదల చేస్తానంటూ కలర్ స్వాతి కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-07-26 06:57:46.0  )
విడాకుల వార్తలు.. నేనే అధికారిక ప్రకటన విడుదల చేస్తానంటూ కలర్ స్వాతి కామెంట్స్!
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ కలర్ స్వాతి ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో ‘అష్టా చమ్మా’ మూవీలో తన అమాయకపు నటనతో అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత హీరో నిఖిల్‌తో పలు చిత్రాల్లో నటించింది. స్వాతి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోయింది. అయితే ఇటీవల కలర్ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ మీరు అనుకుంటున్నట్లు విడాకుల గురించి చెప్పడానికి ఏం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే నేనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. కానీ, ఈ విషయం తెలిసిన వారు ఆమె విడాకుల వార్తలను గట్టిగా ఖండిచకుండా అలా నార్మల్‌గా స్పందిచడంతో నెటిజన్లు నమ్మడం లేదు. ఇప్పటికే విడాకులకు అప్లై చేసిందని విడాకులు వచ్చాక నిహారిక లాగే అనౌన్స్ చేస్తుందని అనుకుంటున్నారు.

Read More: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్ టీజర్..

Advertisement

Next Story