Disney Plus : యూజర్లకు భారీ షాకివ్వబోతున్న OTT ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్..!

by Maddikunta Saikiran |
Disney Plus : యూజర్లకు భారీ షాకివ్వబోతున్న OTT ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ దిగ్గజ OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం "డిస్నీ ప్లస్" (Disney Plus ) తమ యూజర్లకు బిగ్ షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది . నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీప్లస్ కూడా వెళ్తున్నట్టు సమాచారం. కాగా.. పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డిస్నీ ప్లస్ కూడా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధాన్ని అమల్లోకి తీసుకురానుంది.దీంతో డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేయలేరు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిస్నీ ప్లస్ (Disney Plus ) పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపేస్తున్నట్లు సమాచారం .

ఈ క్రమంలో .. డిస్నీ ప్లస్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధంతో పాటు అదనంగా, అక్టోబర్‌లో డిస్నీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచాలని భావిస్తోంది. ధరల పెంపు వల్ల కంపెనీకి గణనీయమైన నష్టం జరగదని సీఈఓ బాబ్ ఇగెర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఏబీసీ న్యూస్ లైవ్ వంటి కొత్త కంటెంట్ అందించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా .. డిస్నీ ప్లస్ ఈ త్రైమాసికంలో మొదటిసారి లాభాలను ఆర్జించిన సందర్బంగా సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది. డిస్నీపెయిడ్ షేరింగ్, హై సబ్‌స్క్రిప్షన్ ఖర్చుల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తరహాలోనే స్ట్రీమింగ్ సర్వీసులను ఆర్థికంగా వృద్ధిచెందేలా పాస్‌వర్డ్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయాలని డిస్నీలక్ష్యంగా పెట్టుకుంది. డిస్నీ తీసుకొస్తున్న కొత్త మార్పులతో సబ్‌స్క్రైబర్లు ఇక నుంచి కొత్త రూల్స్, అధిక ధరలను భరించక తప్పదు. అయితే ఇండియాలో ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.

Advertisement

Next Story

Most Viewed