- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం పవన్ కల్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు రావాలి.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 27 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దానితో పాటు రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య. పవన్ కల్యాణ్‌కు శుభకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు దర్శకుడు సూర్య.
‘‘27 ఏళ్లు పవనిజం. 27 ఏళ్లు పూర్తి చేసుకున్న మీ సినీ లైఫ్, 10 ఏళ్లు పూర్తిచేసుకున్న మీ రాజకీయ జీవితానికి అభినందనలు. పవన్ కల్యాణ్ ఈ దేశానికి ఒక గురువు. ప్రజలకోసం ఆయన చేసే పోరాటం హిస్టరీలో నిలిచిపోతుంది. ఆయన సీఎం అవ్వాలనేది నా కోరిక. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కల్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి’’ అంటూ పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ వీడియోను జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా.. డైరెక్టర్ ఎస్ జే సూర్య వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.