కిరణ్ అబ్బవరం రఫ్ఫాడించేశాడు : డైరెక్టర్ రమేష్ కడూరి

by sudharani |   ( Updated:2023-04-02 12:09:14.0  )
కిరణ్ అబ్బవరం రఫ్ఫాడించేశాడు : డైరెక్టర్ రమేష్ కడూరి
X

దిశ, సినిమా : ‘మీటర్’ థియేటర్స్‌లో రఫ్ఫాడించేస్తుందన్నాడు దర్శకుడు రమేష్ కడూరి. హీరో కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉంటుందన్నాడు. హీరోయిజమ్, ఎమోషన్, లవ్‌కు ఒక కొలత ఉంటుందని.. అందుకే ‘మీటర్’ అనే టైటిల్ పెట్టామని తెలిపాడు. చివరి పదినిమిషాలు హీరో పోలీస్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని, మిగతా సినిమా పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్‌తో కొనసాగుతుందన్నాడు. ఇక హీరోయిన్ అతుల్య రవి తమిళ్ చిత్రాలు చూశాక.. తను ఈ క్యారెక్టర్‌కు సెట్ అవుతుందని సెలెక్ట్ చేశామని, ఆమెకు తెలుగు కూడా రావడం మరింత ప్లస్ అయిందన్నాడు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ కానుంది.

Also Read..

‘రావణాసుర’తో థియేటర్స్ దద్దరిల్లుతాయి.. కుమ్మేద్దాం అంటున్న రవితేజ

Advertisement

Next Story