ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by sudharani |
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ‘పలాస’, ‘నరకాసుర’ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా మూవీ ‘ఆపరేషన్ రావణ్’. రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య తెరకెక్కిస్తున్నాడు. యంగ్ బ్యూటీ సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఆపరేషన్ రావణ్’ తెలుగుతో పాటు తమిళ బాషలో కూడా రూపొందిస్తున్నారు. ఇక ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ రావణ్’ సినిమా నేను ఆరు నెలల క్రితమే చూశాను. చాలా బాగుంది. వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి వెంకట సత్య థ్రిల్లర్ సినిమాను రూపొందించడం మామూలు విషయం కాదు. బాలీవుడ్‌లో ఇలా కొందరు ఫాదర్ సన్ సక్సెస్ అయ్యారు. తెలుగులో ఇప్పుడు రక్షిత్, వెంకట సత్య చేస్తున్నారు. లండన్ బాబులు అనే మూవీతో మెల్లిగా మొదలైన రక్షిత్ జర్నీ పలాసతో పీక్స్‌కు వెళ్లింది. ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేశాడు రక్షిత్. అతనిలో పట్టుదల అంకితభావం ఉన్నాయి. మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. “ఆపరేషన్ రావణ్” సినిమాతో రక్షిత్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు వెంకట సత్య. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ‘ఆపరేషన్ రావణ్’ టీమ్ అందిరకీ ఆల్ ది బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చాడు.




Next Story