మోక్షజ్ఞ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ రిలీజ్ ఈ ఏడాదే .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

by Hamsa |
మోక్షజ్ఞ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ రిలీజ్ ఈ ఏడాదే .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయ్యాడు. కానీ డైరెక్టర్, హీరోయిన్ ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. తను స్లిమ్‌గా అదిరిపోయే లుక్స్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో అంతా ఎన్టీఆర్ అంత పాపులారిటీ దక్కించుకుంటాడని కామెంట్లు పెట్టారు. ఇక తాజాగా, మోక్షజ్ఞ ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడో ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

ఇటీవల హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో మోక్షు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ‘‘ఈ సంవత్సరం బాలయ్య- NBK 109, ఎన్టీఆర్ - దేవర, మోక్షు - అరంగేట్రం, నందమూరి నామ సంవత్సరం’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒకే సంవత్సరం మూడు సినిమాలు రాబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. నెట్టింట పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలను తీసుకోవాలని అనుకుంటున్నారని టాక్. దానికి బాలయ్య ఈ అమ్మడుని ముందే ఒప్పించారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సూపర్ అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed