- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dil Reddy: వైభవంగా ప్రారంభమైన "దిల్ రెడ్డి".. క్లాప్ కొట్టిన సీనియర్ నటుడు
దిశ, సినిమా: అంజన్ కస్తూరి, సాంచి బార్తి జంటగా నటిస్తున్న సినిమా ‘దిల్ రెడ్డి’. ఈ చిత్రాన్ని అమ్మగారి రామరాజు (రమేష్) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ‘దిల్ రెడ్డి’ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మా ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా దిల్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాం. సరికొత్త కథా కథనాలతో కూడిని ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఇందులో తనికెళ్ల భరణి కీ రోల్ చేస్తున్నారు. త్వరలోనే మా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. హీరో అంజన్ కస్తూరి మాట్లాడుతూ ‘నేను నటిస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామరాజు థ్యాంక్స్. యూత్ అండ్ ఫ్యామిలీ అందరిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, ఆలీ, టార్జాన్ తదితరులు నటిస్తున్నారు.