- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మెకానిక్' గొప్ప విజయం సాధిస్తుంది: మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దిల్ రాజు!
దిశ, సినిమా : మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'మెకానిక్'. ట్రబుల్ షూటర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుండన్నాడు. అలాగే ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ తమకు విలువైన సమయాన్ని కేటాయించినందుకుగాను దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకనిర్మాతలు.
కాగా టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా నిర్మించిన సినిమా ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న బర్నింగ్ ప్రాబ్లమ్ నేపథ్యంలో వస్తున్న చిత్రంలో వినోదానికి పెద్ద పీట వేశారు. రేఖ నిరోషా హీరోయిన్‌గా నటించిన మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా త్వరలోనే మూవీ విడుదల తేది ప్రకటిస్తామన్నారు మేకర్స్.