- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిల్‌రాజు ఆ చిత్రం నుంచి నన్ను తప్పుకోమన్నాడు.. నటుడి కామెంట్స్ వైరల్!
దిశ, వెబ్‌డెస్క్: వేణు దర్శకత్వంలో పల్లెటూరి కథతో తెరకెక్కి ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘బలగం’. ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తుంది. సినిమా గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ రూ. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది బలగం సినిమా. దీంతో దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమోగుతుంది.
పెద్దగా పేరున్న నటుల కాకపోయినా చాలా సహజంగా నటించి మెప్పించారు. సాయిలు, కొమురయ్య, ఐలయ్య, నారాయణ, లక్ష్మితో పాటు మరికొన్ని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నారాయణ అనే పాత్రను డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ చేశారు. బామ్మర్దులు అవమానించారని అత్తింటికి దూరమైన అల్లుడిగా ఆయన నటించారు. ఈ సినిమాలో గుర్తిండిపోయే పాత్రల్లో నారాయణ కూడా ఒకటి. అయితే మురళీధర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఈ పాత్ర చేసే అవకాశం తృటిలో చేజారేది, మూవీలో పాత్రలు చేసే నటుల ఫొటోలన్నీ డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు టేబుల్ మీద పెట్టారు. ఫోటోలు అన్ని చూసిన తర్వాత దిల్ రాజు నన్ను వద్దని వేరే నటుడిని తీసుకుందామని అనడంతో వేణు ఆయన్ని ఒప్పించారు. దాంతో నాకు నారాయణ పాత్ర దక్కింది. లేకపోతే ఒక మంచి సినిమాను మిస్ అయ్యేవాడినని’’ చెప్పుకొచ్చారు.
మరో తాజా విషయం ఏంటంటే గతంలో నేను రాసిన పుచ్ఛిక అనే కథకు కొద్దిగా మార్పులు చేసి ‘బలగం’ చిత్రం తీశారంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ మీడియా ముందు ఆరోపణలు చేశారు. దీనికి వేణు స్పందించి.. ఆయన కథ నేను చదివింది లేదు. ఆరేళ్ళు నేను రీసెర్చ్ చేసి రాసుకున్న కథ అని తెలిపారు.