హీరోయిన్‌పై పగ పెంచుకున్న చిరంజీవి పెద్దకూతురు.. ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలనుకుందా?

by Jakkula Samataha |   ( Updated:2024-05-04 10:38:12.0  )
హీరోయిన్‌పై పగ పెంచుకున్న చిరంజీవి పెద్దకూతురు.. ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలనుకుందా?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో నటీనటులపై రూమర్స్ రావడం అనేది చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. ఇక మెగా ఫ్యామిలీపై ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్టైలిస్ట్‌గా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరు 150 సినిమాకి ఈమె స్టైలిస్ట్‌గా చేసింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఈ బ్యూటీకి, ఓ నటికి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ఓ రూమర్ వైరల్ అవుతోంది. దీంతో సుస్మిత ఆ హీరోయిన్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రాకుండా చేసిందని టాక్. ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా? అందాల ముద్దుగుమ్మ కేథరిన్ తెరిస్సా.

ఈ బ్యూటీ మెగాస్టార్ చింజీవి 150 వ సినిమాలో ఐటమ్ సాంగ్‌ రత్తాలు రత్తాలు పాటలో చిరు సరసన ఆడి పాడడానికి ఈ బ్యూటీ బాగుంటుందని సెలెక్ట్ చేశారంట. కానీ షూటింగ్ జరిగే సమయానికి సుస్మితకు, కేథరిన్‌కు మధ్య గొడవలు జరగడంతో, కేథరిన్ ఈ ఐటమ్ సాంగ్ నుంచి తప్పుకున్నట్లు అప్పుడు టాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ఆ తర్వాత లక్ష్మీరాయ్‌ని ఐటమ్ సాంగ్ చేయడానికి తీసుకున్నారు. దీంతో సుస్మిత కేథరిన్ పై ఉన్న కోపంతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ అవకాశం రాకుండా చేసిందని, ఆమెను టాలీవుడ్‌లోనే లేకుండా చేయాలని ట్రై చేసిందని గుస గుసలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ జయ జానకి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ అలరించింది. దీంతో అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. కానీ ఇప్పటికీ ఈ వార్త వైరల్ అవుతూనే ఉంది.

Advertisement

Next Story