- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raayan: రెండు ఓటీటీల్లోకి స్టార్ హీరో బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన మూవీ ‘రాయన్’. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించడంతో పాటుగా.. హీరోగా నటించాడు. అయితే ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అలాగే రాయన్ సినిమాలో అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన మూవీ ‘రాయన్’. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించడంతో పాటుగా.. హీరోగా నటించాడు., ఎస్ జే సూర్య, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసి తదితరులు నటించారు.
అయితే ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించగా.. భారీ అంచనాల నడుమ జూలై 26న థియేటర్స్‌లో విడుదలైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ తెలుగులో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే కోలీవుడ్‌లో పాజిటివ్ టాన్‌ను సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో.. తాజాగా, రాయన్ డిజిటల్ రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులకు అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. అయితే రాయన్ ఆగస్టు 30 నుంచి ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీ చేస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొందరలోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Read More..
Raayan Movie OTT : రెండు ఓటీటీల్లోకి ఒకేసారి రానున్న ధనుష్ రాయన్ మూవీ