- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో కలిసి ధనుష్ రచ్చ.. ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం కొద్ది రోజులు సాఫీగా సాగినప్పటికీ వీరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. కానీ, ధనుష్ మామపై ఎప్పటికప్పుడు అభిమానం చూపిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆయనపై ఓ ట్వీట్ కూడా చేశాడు. అంతేకాకుండా ధనుష్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా కానీ, సమయం తీసుకుని మరీ రజినీకాంత్ ‘జైలర్’ సినిమా చూసేందుకు వెళ్లారు. కానీ, అప్పటికే అక్కడ తన అత్తగారు కూడా అదే థియేటర్‌లో ఉన్నారు.
నటి త్రిషతో కలిసే ధనుష్ సినిమా చూసేందుకు వచ్చాడని పలు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. వీరిద్దరూ పక్కన పక్కనే ఉండి సినిమాను ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరూ జైలర్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ థియేటర్‌లో రచ్చ చేశారు. దీంతో అత్తగారి ముందే త్రిషతో ధనుష్ ఎంజాయ్ చేస్తున్నాడని ఆమెతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా, రజినీకాంత్, తమన్నా ఇద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం ‘జైలర్’. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ, మోహన్ లాల్, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్టు 10 థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
Read More: చైనా స్కూల్లో మెగాస్టార్‌పై ప్రజెంటేషన్.. చప్పట్లతో అభినందించిన స్టూడెంట్స్