- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raayan Movie OTT : రెండు ఓటీటీల్లోకి ఒకేసారి రానున్న ధనుష్ రాయన్ మూవీ
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తానే హీరో కమ్ దర్శకత్వం వహించిన మూవీ ‘రాయన్’ Raayan. ధనుష్ సినీ కెరీర్లో ఇది 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్ర పోషించాడు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జులై 26న థియేటర్లలో రిలీజ్ అయిన రాయన్ మూవీకి అదిరిపోయే స్పందన వచ్చింది. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ మూవీని తెరకెక్కించాడు. కోలీవుడ్ లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికి కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో మూవీ దూసుకెళ్తుంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఒకేసారి రెండు ఓటీటీ లలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో (Amazon Prime Video), సన్ నెక్ట్స్ (Sun NXT) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలిసిన సమాచారం. ఆగస్టు 30 నుంచి రాయన్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమచారం. మరి కొద్దీ రోజుల్లో ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు.