రంగస్థలం మూవీ టైంలో మనసుపారేసుకున్న దేవీ శ్రీ.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?

by samatah |   ( Updated:2022-09-08 09:37:19.0  )
రంగస్థలం మూవీ టైంలో మనసుపారేసుకున్న దేవీ శ్రీ.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన మ్యూజిక్ ‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఈయన మ్యూజిక్ అందించిన ఎన్నో చిత్రాలు మంచి హిట్ అందుకున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇదిలా ఉంటే సెలబ్రిటీలకు సంబంధించిన చాలా ఇష్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వారి లవ్ స్టోరీస్ గుంరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దేవీశ్రీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ లవ్ స్టోరీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇప్పటికే దేవీ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, పెళ్లిదాక వచ్చేసరికి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఆమధ్య ఓవార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా మరో వార్త నెట్టింట్లో షికారు చేస్తుంది. దేవీ శ్రీప్రసాద్ హీరోయిన్ పూజిత పొన్నాడ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రంగస్థలంలో కీలక పాత్రలో నటించిన ఈ అమ్మడుపై దేవీ మనసు పారేసుకున్నాడంట. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారంట. అయితే పూజిత పొన్నాడ హీరోయిన్‌గా పేరుతెచ్చుకునేందుకు చాలా కష్టపడుతున్న తరుణంలో దేవీ ప్రసాద్‌తో ప్రేమ వ్యవహారం బయటపడటంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గా సమాచారం. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనంట.

Also Read : ఆ వీడియో చూసి.. Nivetha Thomas ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

Advertisement

Next Story

Most Viewed