- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని కోసం నిమిషానికి రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ !
దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతంచేసుకుంది. అప్పటి వరకు చిన్న చిన్న హిందీ సీరియల్స్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ తనకంటూ హీరోయిన్ ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్న మృణాల్.. సినిమాల ఎంపిక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటుందనే చెప్పాలి. రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలను మాత్రమే సద్వినియోగం చేసుకోకుండా.. కథలో కంటెంట్ ఉందా.. లేదా? అనే విషయాలను చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
తాజాగా ‘హాయ్ నాన్న’ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మృణాల్. ఇక డిమాండ్ ఉన్న హీరోయిన్లను వ్యాపార సంస్థల ఓపెనింగ్స్‌కు పిలవడం కామనే. ఇలా చాలా మంది హీరోయిన్లు ఓపెనింగ్ కోసం లక్షలు తీసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే మృణాల్ కూడా భారీగానే డిమాండ్ చేస్తోందట. ఒక్క షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావాలంటే.. అక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నా ఒక్క నిమిషాకి రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నదట. అంటే గంటకు పైనే ఉంటే.. ఆరుకోట్లు ఆమెకు సమర్పించుకోవాల్సిందే. దీంతో భయపడిపోతున్న షాపింగ్ మాల్ నిర్వాహకులెవరూ ఆమెను పిలవడం లేదట. ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్స్ ‘ఎంత ఫేమ్ ఉంటే మాత్రం అంత డిమాండ్ చేయకూడదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
- Tags
- Mrunal Thakur