తెలుగు దర్శకుడి తొలి హిందీ చిత్రం : విడుదలకు డెట్ ఫిక్స్

by Shiva |   ( Updated:2023-04-26 14:40:25.0  )
తెలుగు దర్శకుడి తొలి హిందీ చిత్రం : విడుదలకు డెట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు యువ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో తన మొదటి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'IB71' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు విడుదల తేదీ ఖరారైంది. ఈ గూఢచర్య థ్రిల్లర్ మే 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉందని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

ఈ దేశభక్తి స్పై థ్రిల్లర్‌లో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా, అశ్వత్ భట్, దలీప్ తాహిల్, డానీ సురా, సువ్రత్ జోషి మరియు దివాకర్ ధ్యాని తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించారు. విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్, భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

.Also Read...

రియల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న అదాశర్మ

Advertisement

Next Story