Dasara box office collection Day 1: సునామీ సృష్టిస్తున్న‘దసరా’..

by sudharani |   ( Updated:2023-03-31 13:03:28.0  )
Dasara box office collection Day 1: సునామీ సృష్టిస్తున్న‘దసరా’..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘దసరా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘దసరా’ సినిమా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందో తెలుసుకుందాం.

కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే హైదరాబాద్‌లో రూ. 3.8 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. నైజాం ఏరియాలో తొలి రోజు రూ.6.78 కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు అంచనా. అంతేకాకుండా ఇండియాలో ‘దసరా’ సినిమా 17 నుంచి 20 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 20 నుంచి 25 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే నాని పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడం కాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ‘దసరా’ సినిమా 2700 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ ఐదు సినిమాలను మిక్స్ చేసే దసరా సినిమా తీశారా?

Ravi Teja: రవి తేజతో రామ్ పోతినేని వార్ ?

Advertisement

Next Story