దర్శన్‌ నా పెద్ద కొడుకు.. అతను ఇప్పటికీ నిందితుడే.. నటి సుమలత సంచలన వ్యాఖ్యలు

by Kavitha |
దర్శన్‌ నా పెద్ద కొడుకు.. అతను ఇప్పటికీ నిందితుడే.. నటి సుమలత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన రేణుకా స్వామి హత్య కేసులో హీరో దర్శన్‌, తన ప్రియురాలు నటి పవిత్ర, వీరితో పాటు మరో 15 మంది నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. కాగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శన్‌కు బాగా దగ్గరగా ఉన్న నటీనటులపై కూడా ఒత్తడి పెరుగుతోంది. ఈక్రమంలో దర్శన్ అరెస్ట్‌పై సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రియాక్టయ్యారు. అయితే దర్శన్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్న సుమలత మాత్రం చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గానే స్పందించారు. ఇన్నాళ్లకు ఆమె దర్శన్‌ అరెస్ట్ ఇష్యుతో పాటు దర్శన్‌కు తనకు ఉన్న బంధాన్ని ఓ లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

ఆ లేఖలో భాగంగా.. నాలుగున్నర దశాబ్దాలుగా నేను సినిమా రంగంలో ఉన్నాను. నటిగా, కళాకారిణిగా, లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నాను. ఇలా అనేక రంగాల్లో ఉన్న నేను ఎప్పుడూ అనవసరమైన వ్యాఖ్యలు చేయలేదు. అలా చేయడం కూడా టైమ్ వేస్ట్‌గా భావిస్తాను. ఇక దర్శన్ విషయానికి వస్తే.. నా కుటుంబంతో దర్శన్‌ కుటుంబానికి ఉన్న బంధం ఏమిటనేది ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అతడు హీరో అవ్వకముందు నుంచి దాదాపు పాతికేళ్లుగా దర్శన్ కుటుంబానికి.. నా కుటుంబానికి మధ్య అనుబంధం ఉంది అన్నారు. స్టార్‌డమ్‌కు మించి దర్శన్‌ నాకు కుటుంబసభ్యుడు. కొడుకు లాంటి వాడు. అంబరీష్‌ను ఎప్పుడూ నాన్న అని పిలిచేవాడు. ఏ తల్లి కొడుకును ఇలాంటి పరిస్థితిలో చూడటానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ మీరు అంటున్న పనులు ఎప్పుడూ చేయడు. ఇలాంటి నేరం దర్శన్ చేశాడు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే.. దర్శన్ ప్రేమ, కరుణ, జాలి ​​హృదయం ఉన్న వ్యక్తి మాత్రమే. ఇంత కృరంగా ఆలోచించే స్వభావం కాదు అతనిది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే మంచి మనసు అతడిది అని అన్నారు సుమలత

అంతే కాదు. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను బలంగా నమ్ముతున్నాను' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై ఏమీ మాట్లాడనని చెప్పారు. ఇక ఆమె దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై కామెంట్లు చేసేవారిని కూడా సుమలత తప్పుబట్టారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏది నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్‌ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్తంభించిపోయింది.' అని ఆమె లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed