- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: ‘రాజాసాబ్’లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్.. హైప్ పెంచుతున్న న్యూస్!
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruti) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’(Raja Saab). యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే ఇందులో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్(Malavika Mohan), నిధి అగర్వాల్, రిద్ది కుమార్(Riddhi Kumar) నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతూ హైప్ పెంచుతోంది.
ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కూడా ఎంట్రీ కూడా ఉంటుందని టాక్. ‘రాజాసాబ్’ ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతితో ఉన్న పరిచయం.. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో ఈ ప్రాజెక్ట్‌ను ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నెట్టింట ఈ వార్త వైరల్ కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏకంగా నలుగురు భామలతో ప్రభాస్ రొమాన్స్ ఏవిధంగా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ప్రభాస్, నయనతార ఇప్పటికే ‘యోగి’ సినిమాలో నటించి మెప్పించారు. మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుండటంతో అభిమానులు ఆనందపడుతున్నారు.