అమ్మానాన్నతో దళపతి.. ఆ స్పెషల్ మూమెంట్ కోసమేనా..?

by Kavitha |
అమ్మానాన్నతో దళపతి.. ఆ స్పెషల్ మూమెంట్ కోసమేనా..?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌ హీరో అయిన దళపతి విజయ్ అందరికీ సుపరిచితమే. తన నటనతో ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్‌‌ని క్రియేట్ చేసుకున్నాడు. విజయ్‌ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘The Greatest Of All Time’. ఈ సినిమా ఇప్పటికే టైటిల్‌ పోస్టర్‌, లుక్‌ని లాంచ్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. The GOAT స్టిల్స్‌లో విజయ్‌ ఓ వైపు ఓల్డ్‌ మ్యాన్‌గా, మరోవైపు యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.

మరోవైపు హెచ్ వినోథ్ దర్శకత్వంలో ‘దళపతి 69’ మూవీలో నటిస్తున్నాడు. విజయ్‌ ఈ సినిమాతో తన సినీ ప్రయాణానికి గుడ్ బై చెప్పి.. రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉండబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 2024 ఫిబ్రవరి 2న Tamilaga Vetri Kazham పార్టీని స్థాపించాడు.

ఇదిలా ఉండగా తాజాగా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండే విజయ్‌ విరామం తీసుకొని అమ్మానాన్న దగ్గరకు వెళ్లాడు. అమ్మానాన్నతో విలువైన సమయాన్ని గడిపాడు. తల్లిదండ్రులతో విజయ్‌ దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. విజయ్‌ ఇలా అమ్మానాన్నను కలవడం వెనుక ఏదైనా సీక్రెట్‌ ఉందా..? అంటూ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ స్టిల్ చూసిన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed