ఏకంగా నాలుగో పెళ్ళికి రెడీ అయిన వివాదాస్పద హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్(పోస్ట్)

by Kavitha |   ( Updated:2024-10-02 15:10:51.0  )
ఏకంగా నాలుగో పెళ్ళికి రెడీ అయిన వివాదాస్పద హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద హీరోయిన్ వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు. ఈమె తెలుగు, తమిళ్ వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. అందులో భాగంగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో ఆమె వివాదం పెట్టుకున్న సంగతి అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు చాలా కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసి పాపులర్ అయ్యింది. తెలుగులో చివరిగా మళ్లీ పెళ్లి అనే మూవీలో నటించింది.

ఇదిలా ఉంటే.. ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..? 2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కూడా విడిపోయారు. మళ్లీ ఆతర్వాత పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

అలా వరుసగా పెళ్లిళ్లు చేసుకొని అవి పెటాకులు అవ్వడంతో.. ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాల పై పెట్టింది. కానీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది వనిత విజయ్ కుమార్. ఇతగాడు తమిళ్ బిగ్ బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు. వారిద్దరూ బీచ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన వనిత అక్టోబర్ 5 సేవ్ ది డేట్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Advertisement

Next Story