- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పెళ్లై పిల్లలున్నా మహిళను వివాహమాడబోతున్న హైపర్ ఆది? టంగ్ స్లిప్ అయి!
దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత పదేళ్లుగా జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ.. డబుల్ మీనింగ్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఆది వేసే డబుల్ మీనింగ్ పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఈ షో తో ద్వారా ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఆది పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
రీసెంట్‌గా తెరకెక్కిన విశ్వక్ సేన్ చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో ఈ కమెడియన్ ముఖ్య పాత్రలో కనిపించి.. ప్రేక్షకుల మన్ననలు పొందాడు. నటన పరంగా ఎంత గుర్తింపు తెచ్చుకుంటునప్పటికీ ఆది పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఫ్యాన్స్ ఈ కమెడియన్ వివాహం చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్ నరేష్.. ఆదిపై షాకింగ్ పంచ్ విసిరాడు.
‘‘ఏయ్ తమ్ముడు.. ఏయ్ తమ్ముడు అంటూ హైపర్ ఆదిని పిలుస్తాడు. రేయ్ నేను నీకు తమ్ముడేంట్రా. నువ్వే నాకు తమ్ముడివిరా అనగా.. ఒకే అన్నా.. నువ్వు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావ్ అని అడుగుతాడు. ఓ మంచి తండ్రిని కావాలనుకుంటున్నానని ఆది వెంటనే బదులిస్తాడు. దీంతో నరేష్.. నువ్వు ఫాదర్ ఏంటన్నా స్టెప్ ఫాదర్ వు అవుతావు కానీ అంటూ నవ్వుతూ అంటాడు.
ఒక్కసారిగా షో లో నవ్వులు పూస్తాయి. హైపర్ ఆది ఫేస్ మాత్రం వాడిపోతుంది. హైపర్ ఆది పెళ్లై పిల్లలున్న మహిళను వివాహం చేసుకోబోతున్నాడనే అర్థంలో నరేష్ వేసిన పంచ్ లు నెట్టింట వైరల్ అవ్వగా.. జనాలు ఆశ్యర్యపోతూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.