భూమ మౌనిక కొడుకుతో మంచు ఫ్యామిలీలో మొదలైన గొడవలు?

by samatah |
భూమ మౌనిక కొడుకుతో మంచు ఫ్యామిలీలో మొదలైన గొడవలు?
X

దిశ, వెబ్‌డెస్క్ : భూమా మౌనిక, మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో మంచు ఫ్యామిలీ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోయినా, తర్వాత పెళ్లికి అందరూ హాజరై, ఘనంగా వారి వివాహం జరిపించారు.

అయితే మౌనికకు, మనోజ్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే మంచు ఫ్యామిలీ మౌనికతో పెళ్లిక ఒప్పుకోకపోవడానికి కారణం ఉందంట. ఎందుకంటే మౌనికకు ఇదివరకే పెళ్లి కావడం అంతే కాకుండా కొడుకు కూడా ఉండటం వలన మంచు ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోలేదంట. అయితే వారు పెళ్లికి హాజరైనప్పటికీ ఇప్పటికీ మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంట.

మౌనిక కొడుకు వలన ఇంట్లో మరోసారి గొడవలు మొదలయ్యాయంట. అయితే ధైరవ్ రెడ్డి భాద్యతలు పూర్తిగా తనవే అని మంచు మనోజ్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ పేరిట ఉన్న ఆస్తి మొత్తానికి ప్రస్తుత వారసుడు ధైరవ్ రెడ్డి అని పరోక్షంగా చెప్పినట్లే. దీంతో వేరే వ్యక్తి పుట్టిన కొడుకు మంచు ఫ్యామిలీకి వారసుడు ఎలా అవుతాడు అని మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ తెలియదు.

Advertisement

Next Story

Most Viewed