Kantara-2 సినిమాపై క్లారిటీ!

by Hajipasha |   ( Updated:2022-12-26 04:18:03.0  )
Kantara-2 సినిమాపై క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కొత్త సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అంతేకాక రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓవర్ ఆల్‌గా రూ. 400 కోట్ల కనెక్షన్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల వద్ద పాజిటివ్ టాక్‌తో మెప్పించగా.. కాంతార-2 కూడా పైన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే దానిపై విజయ్ కిరంగదూర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 'కాంతార‌' కు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు విజయ్ చెప్పాడు. సీక్వెల్‌కు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుతం వేరే సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలిపారు. అందువల్ల కాంతార-2 సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అన్నారు.

Also Read...

తెలుగు సినిమాలకు IMDB లో తక్కువ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే !

Advertisement

Next Story