కమెడియన్ సుధాకర్ కొడుకుకి అండగా నిలిచిన చిరంజీవి..

by Anjali |   ( Updated:2023-06-24 14:43:56.0  )
కమెడియన్ సుధాకర్ కొడుకుకి అండగా నిలిచిన చిరంజీవి..
X

దిశ, సినిమా: కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన 45 ఇయర్స్ కెరీర్‌లో.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలో 600 పైగా చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అప్పుట్లో లావుగా బందోబస్తుగా కనిపించిన సుధాకర్.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. పళ్ళు ఊడిపోయి రూపురేఖలే మారిపోయాయి. కాగా తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఓ టీవీ కార్యక్రమం స్పెషల్ ఈవెంట్‌కి కొడుకుతో పాటు వచ్చారు సుధాకర్. ఇందులో భాగంగా మాట్లాడుతూ ‘నా కొడుకు మైఖేల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నా కొడుకును లాంచ్ చేయబోతున్నారు. చిరంజీవి నా మిత్రుడు. శ్రేయోభిలాభి. మా అబ్బాయి గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు. చిరంజీవి గారే చూపిస్తారు’ అని అన్నారు సుధాకర్. ఇక మైఖేల్ కూడా తన మాటలతో ఆకట్టుకున్నాడు. ‘చాలామంది మీ డాడీ మళ్లీ సినిమాలు చేస్తాడా? అని అడుగుతున్నారు. అందుకే మీ ముందే అడుగుతున్నా’ అని.. ‘డాడీ మళ్లీ మూవీస్ చేస్తావా?’ అని స్టేజ్‌పై సుధాకర్‌నే అడిగేశాడు. దీంతో సుధాకర్.. ‘నువ్వు చేస్తున్నావు కదా.. ఇక నేను చేయను’ అని సమాధానం ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed