Megastar Chiranjeevi : చిరంజీవి కొత్త సినిమా టైటిల్ రిలీజ్..

by Mahesh |   ( Updated:2024-01-25 04:32:13.0  )
Megastar Chiranjeevi  : చిరంజీవి కొత్త సినిమా టైటిల్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 156 సినిమా పేరును చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు "విశ్వంభర" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రోజు సాయంత్రం చిత్ర యూనిట్ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు బిగెస్ట్ హిట్ ఇచ్చిన బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ ఎత్తున తారాగనం నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య తో మంచి హిట్ సాధించిన చిరుకు భోళాశంకర్ సినిమా ఫ్లాప్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాపై చిరు అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story