Chiranjeevi-Niharika: ‘కమిటీ కుర్రాళ్లు’ మూవీ చూసి ఫస్ట్ రివ్యూ చెప్పిన చిరంజీవి.. నిహారిక హిట్ కొట్టడం ఖాయం!

by Anjali |   ( Updated:2024-08-06 11:14:05.0  )
Chiranjeevi-Niharika: ‘కమిటీ కుర్రాళ్లు’ మూవీ చూసి ఫస్ట్ రివ్యూ చెప్పిన చిరంజీవి.. నిహారిక హిట్ కొట్టడం ఖాయం!
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్లు అనే చిత్రం ఆగస్టు 9 వ తారీకున విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు రివ్యూ చెప్పి, ట్విట్టర్‌ వేదికన పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మా మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రాన్ని నిర్మించింది. ఇది ఆగస్టు 9 వ తేదీన విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని అందరికంటే ఫస్ట్ నేనే వీక్షించాను. నాకు చాలా బాగా నచ్చింది. మూవీ ఎంతో బాగుంది. నిహారిక నిర్మించిన సినిమా నన్ను ఇంప్రెస్ చేసింది. నిహారిక వెరీ టాలెంటెడ్.

గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలోని పదకొండు మంది ఫ్రెండ్స్ మధ్య సాగే స్టోరీ. ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు.. నిహారిక ప్రొడ్యూసర్‌గా కూడా మంచిగా రాణించగలదు. దర్శకుడు యదు వంశీకి కూడా ఇది ఫస్ట్ చిత్రం. కమిటీ కుర్రాళ్లు సినిమాతో చాలా మంది యాక్టర్స్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం మంచి విషయమని చెప్పుకోవచ్చు. ఇందులోని సాంగ్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చాయి. ఈ మూవీ ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీలో నటించిన వారందరికీ మంచి పేరు, అవార్డులు, రివార్డులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి .. కుమార్తె నిహారిక మొదటి సినిమా రివ్యూ చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ స్పందించి నిహారిక మొదటి సినిమాతో భారీ విజయం అందుకోవడం ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed