'ఛత్రపతి' హిందీ రీమేక్ సినిమా అన్నీ కోట్లు సాధిస్తేనే హిట్ ఐనట్టు?

by Prasanna |   ( Updated:2023-05-13 13:55:35.0  )
ఛత్రపతి హిందీ రీమేక్  సినిమా అన్నీ కోట్లు సాధిస్తేనే హిట్ ఐనట్టు?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో స్టార్ హీరోగా నిలతోక్కోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు తన రూటును పూర్తిగా మార్చేసి బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. టాలీవుడ్లో సినిమాలకు పెద్దగా గుర్తింపు రావడం లేదని బాలీవుడ్ ను నమ్ముకొని చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి హీరోగా నటించాడు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ వివినాయక్ డైరక్షన్ వహించారు. మే 12 న థియేటర్లో విడుదల అయింది. సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పిన దాని బట్టి చూస్తే అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాకు రూ. 50 కోట్లు పెట్టారట. హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే రూ. 75 కోట్లకు పైగా సాధించాలి. మొదటి రోజు కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి.. లాంగ్ రన్లో కలెక్షన్స్ అందుకుంటాయో ? లేక ఫ్లాప్ గా ఉండిపోతుందో అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని విడాకులు తీసుకుని ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా?

Advertisement

Next Story