నన్ను ప్రతి సెకన్ రేప్ చేసి చంపుతున్నారు.. టార్చర్ అనుభవిస్తున్నా.. స్టార్ నటి సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2024-02-15 09:56:21.0  )
నన్ను ప్రతి సెకన్ రేప్ చేసి చంపుతున్నారు.. టార్చర్ అనుభవిస్తున్నా.. స్టార్ నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది కల్పిక గణేష్. తెరపై కనిపించేది పది నిమిషాలైనా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ‘ప్రయాణం’ సినిమాతో కెరీస్ ప్రారంభించిన కల్పిక గణేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో హీరోయిన్ సమంత సిస్టర్‌గా మెయిన్ రోల్‌లో నటించే రేంజ్‌కు వెళ్లింది. సినిమాల్లోనే కాకుండా కల్పిత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

అయితే ఈ బ్యూటీ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఫుల్ డేర్‌ అండ్ డ్యాష్‌గా ఉంటుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఈ క్యారెక్టరే కల్పితకు కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెడుతుంది. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై తను లైఫ్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ‘‘సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. ముఖ్యంగా ఇన్‌స్టాలో కొంతమంది ప్రతి సెకండ్ ఆన్లైన్ ద్వారా రేపింగ్ చేస్తున్నారని కల్పిత ఎమోషనల్‌గా వెల్లడించారు.

చాలా రోజుల కిందట నటుడు అభినవ్ గోమటం ఐటమ్ అన్నారని తీవ్రంగా మండిపడుతూ తెలిపింది. మరికొంతమంది అసభ్యకర వర్డ్స్ యూజ్ చేసి కామెంట్స్ పెడతారని, కొన్ని సార్లు టార్చర్ అనుభవించానని, నిజాలు మాట్లాడితే ప్రజలకు నచ్చదని చెప్పింది. ఫేక్ అకౌంట్స్ స‌ృష్టించి మరీ ట్రోల్ చేశారని.. వాటన్నింటినీ డేర్‌గా ఎదుర్కొన్నానని కొన్ని సందర్భాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాల్సి వస్తుందని కల్పిత గణేష్ ఫైర్ అవుతూ వెల్లడించింది. ప్రస్తుతం కల్పిత కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed