Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

by sudharani |   ( Updated:2023-06-21 16:01:12.0  )
Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
X

దిశ, సినిమా: రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా ఏంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. 2005లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ టూ కోలివుడ్ వరకు భారీ వసూళ్లు రాబట్టింది. అయితే 18 సంవత్సరాలకు ఈ మూవీ సీక్వెల్ రానుంది. ఇందులో రాఘవ లారెన్స్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, వడివేలు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా వెల్లడించింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. దీంతో ఈ మూవీని సెప్టెంబర్‌లో వినాయక చవతి సందర్భంగా విడుదలచేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి : పాన్ ఇండియన్ మూవీకి బ్రేక్ వేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Advertisement

Next Story