ఉయ్యాలలో ఊసులు.. కళ్ళతోనే కబుర్లు.. వైరల్ అవుతున్న చైతూ, శోభితాల ఎంగేజ్మెంట్ ఫొటోలు

by Kavitha |
ఉయ్యాలలో ఊసులు.. కళ్ళతోనే కబుర్లు.. వైరల్ అవుతున్న చైతూ, శోభితాల ఎంగేజ్మెంట్ ఫొటోలు
X

దిశ, సినిమా: సమంతతో విడాకుల తర్వాత గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్‌తో ఫ్యాన్స్‌ను సంతోష పెట్టారు. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ స్వయంగా అక్కినేని నాగార్జుననే వారి ఫొటోలను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు.

నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం ఫొటోలు చూసి.. అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే వీరిద్దరూ ఎంగేజ్మెంట్‌ను చాలా సింపుల్‌గా చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఎలాంటి హంగామా లేకుండా.. కేవలం అరిటాకులతో అలంకరించిన వేదికపై నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


తాజాగా చైతూ, శోభితాలు ఇన్‌స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో వేదిక పక్కనే ఏర్పాటు చేసిన ఉయ్యాలలో కూర్చున్న వీరు కళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటూ లోకాన్ని మరిచిపోయారు. వాటిని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా చైతూ, శోభితాల నిశ్చితార్థం ఆగస్టు 8, ఉదయం 9.42 గంటలకు జరిగింది. '8.8.8.. అనంతమైన ప్రేమకు ప్రారంభం' అంటూ నాగార్జున వారిని ఆశీర్వదించిన సంగతి తెలిసిందే.

(photos link credits to shobita dulipala, chayakkineni instagrams id's)

Advertisement

Next Story