మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా ?

by Sridhar Babu |
మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా ?
X

దిశ,అశ్వారావుపేట : అక్కాచెల్లమ్మలు... బాగున్నారా... సొంత ఇళ్లున్నాయా మీకు....ఇంతకీ నేనేవరో తెలుసా...? మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా...? అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాసేపు సరాదాగా ముచ్చటించారు. అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అశ్వారావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకుని ములకలపల్లి వెళ్తూ మార్గమధ్యలో శనక్కాయలు శుభ్రపరుస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు. వారితో పై విధంగా కాసేపు సరాదాగా సంభాషించారు. చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును అందించారు. అదే విధంగా కొద్ది దూరం వెళ్లాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని నచ్చినట్టు కట్టుకోమని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed