ఎరుపెక్కిన నారాయణపురం..

by Naveena |
ఎరుపెక్కిన నారాయణపురం..
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: భారత కమ్యూనిస్టు పార్టీ గురువారంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహా ప్రదర్శన ర్యాలీ 100 జండాలతో నిర్వహించారు. ప్రజానాట్యమండి కళాకారులు డప్పులతో విప్లవ పాటలతో మండల కేంద్రంలోని వీధుల గుండా మహాప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ర్యాలీలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జీని యాదగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. మహా ప్రదర్శన ర్యాలీ ముగింపు సందర్బంగా స్థానిక చౌరస్తాలో ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ గ్రామాన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొన్నదని గుర్తు చేశారు. పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించడమే కాకుండా నిరుపేదలకు భూమిని పంచిన చరిత్ర సిపిఐ ది అని అన్నారు. డిసెంబర్ 30న నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సిపిఐ పార్టీ కార్యకర్తలు,నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహా ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్,కలకొండ సంజీవ, వీరమల్ల యాదయ్య, పొట్ట శంకరయ్య, మంచాల జంగయ్య, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed