Tollywood Meet: రాజకీయ జోక్యం వద్దు.. సినీ ప్రముఖుల భేటీలో భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్

by Ramesh N |   ( Updated:2024-12-26 10:14:50.0  )
Tollywood Meet: రాజకీయ జోక్యం వద్దు.. సినీ ప్రముఖుల భేటీలో భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ సినీ ప్రముఖులు (Tollywood Meet) గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో కీలక విషయాలు చర్చించారు. సినిమా పరిశ్రమ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని, కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని తెలిపారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. టాలివుడ్ పరిశ్రమను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. సినిమాలకు మా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చిందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం వద్దు: భట్టి విక్రమార్క

సినీ ప్రముఖుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. మాది ప్రజా ప్రభుత్వం.. ఏడాది కాలంగా అంతా తమ పరిపాలన గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమ కూడా తమతో కలిసి రావాలని, తెలంగాణ రైజింగ్‌లో బిజినెస్‌ మోడల్‌ను తీసుకెళ్దామన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దని భట్టి విక్రమార్క సూచించారు.

Advertisement

Next Story

Most Viewed