నా పని ఇంకా అయిపోలేదు.. ‘బుడ్డీ’ కామెంట్స్‌పై నటి ఫైర్

by Hamsa |   ( Updated:2023-04-23 09:35:14.0  )
నా పని ఇంకా అయిపోలేదు.. ‘బుడ్డీ’ కామెంట్స్‌పై నటి ఫైర్
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వల్గర్ ట్రోలింగ్‌పై బాలీవుడ్ యాక్ర్టెస్ చాహత్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి తాను ఎంత కష్టపడుతున్నానో తెలియకుండానే తన గురించి నీచమైన మాటలు మాట్లాడటం హృదయ విదారకమని పేర్కొంది. కొంతకాలంగా తాను వెండి తెరపై కనిపించకపోవడంతో ‘బుడ్డీ’ అని కొంతమంది పిలిస్తే.. మరికొందరూ ‘గోల్డ్ డిగ్గర్’గా పరిగణిస్తూ పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఎమెషనల్ అయింది. ‘కెమెరాలో కనిపించనంత మాత్రాన నేను పని చేయడంలేదని అర్థం కాదు. సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు మనీ.. కోట్ల విలువైన స్టార్టప్‌తో బిజీగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకూ ఇండస్ట్రీలో పనిని ఒప్పుకోకూడదనుకుంటున్నా’ అని స్పష్టం చేసింది చాహత్.

Also Read: Pooja hegde: ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డే మీద కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్

Advertisement

Next Story