- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రామోజీ రావు ది రియల్ హీరో: చదలవాడ శ్రీనివాస్
దిశ, వెబ్డెస్క్: ఈనాడు గ్రూప్స్ అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు అంత్యక్రియలు వేలాది మంది కన్నీటి వీడ్కోలు నడుమ ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో అధికారిక లాంఛనాల నడుమ రామోజీ రావు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రామోజీ రావును కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాస్ రామోజీ రావు కడసారి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీ రావు రియల్ హీరో అని కొనియాడారు. రామోజీ రావు సామ్యానుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగారని గుర్తు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగిన మూలాలు మరిచి పోని వ్యక్తి రామోజీ అని ప్రశంసించారు. సినిమా అంటే రామోజీ రావుకు ఎంతో ప్రాణం అని గుర్తు చేశారు. రామోజీ రావు ప్రతిఘటన అనే గొప్ప సినిమా నిర్మించారన్నారు. పత్రిక రంగంలో ఆయన సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు.