- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mythri Movie Makers:మైత్రి మూవీ మేకర్స్‌పై GST రైడ్స్.. సోదాల వెనుక రాజకీయ కోణం..?
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ టాప్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రీ మూవీస్ కార్యాలయంలో కేంద్ర జీఎస్టీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. సోమవారం ఉదయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ యజమానులైన నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌తో పాటు ఆ సంస్థకు సంబంధించిన సిబ్బందికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప, సర్కార్ వారి పాట వంటి సినిమాలతో పాటు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలను ఈ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.
దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సంస్థ మరో నాలుగు సినిమాలను నిర్మిస్తోంది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిన్ననే మైత్రీ మూవీస్ ప్రారంభించగా ఇవాళ్టి నుంచి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్‌లో పుష్ప 2 మూవీ షూటింగ్ ను ప్రారంభించాల్సి ఉంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసంహారెడ్డి సినిమానలు మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాలను విడుదలకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో జీఎస్టీ అధికారుల సోదాలు సంచలనంగా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, నానితో పాటు పలువురు పెద్ద హీరోలతో ఈ సంస్థ సినిమాలను చేసింది.
జీఎస్టీ సోదాల వెనుక రాజకీయ కోణం?:
కాగా, పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ప్రారంభించిన మరుసటి రోజే మైత్రీ మూవీ మేకర్ సంస్థపై కేంద్ర జీఎస్టీ రెయిడ్స్ చేయడం రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ సోదాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి వార్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలను ఈ సంస్థే నిర్మిస్తున్నందున ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల టాలీవుడ్ అగ్ర కథానాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగానే టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్‌పై రెయిడ్స్ కొనసాగుతున్నాయంటూ కొంత మంది గుసగసులాడుకుంటున్నారు.
కాగా చిరంజీవి, బాలకృష్ణతో నిర్మించిన రెండు భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉండగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌తో మరో రెండు భారీ చిత్రాలకు ఈ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే జీఎస్టీ ఇష్యూస్‌ను పక్కగా తేల్చడానికే ఈ సోదాలు కొనసాగుతున్నాయని మరి కొంత మంది వాదిస్తున్నారు. మొత్తంగా రెయిడ్స్‌పై అధికారుల నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.