ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం.. తట్టుకోలేక హస్పిటల్‌లో చేరిన స్టార్ నటి

by samatah |   ( Updated:2023-07-18 06:49:43.0  )
ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం.. తట్టుకోలేక హస్పిటల్‌లో చేరిన స్టార్ నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ప్రతి నెల పీరియడ్స్ కారణంగా తాను ఎదుర్కొన్న అతిభయంకరమైన అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మేరకు 15 సంవత్సరాలకే ఫ్యాషన్ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించిన బ్యూటీ.. ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని కెరీర్‌ను నిర్మించుకున్నట్లు చెప్పింది. ‘డిస్మెనోరియా కారణంగా ఋతుస్రావం సమయంలో తీవ్రమైన రక్త స్రావం అయింది. పొత్తికడుపులో తిమ్మిరి కారణంగా ప్రతి నెలా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో నాకు శారీరకంగానే కాదు మానసికంగానూ చాలా నష్టం జరిగింది. ఎన్నో కలలు, ఆకాంక్షలు ఉన్న నాలాంటి ఆడపిల్లలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఒక రకంగా జీవితాన్ని వెనక్కు లాగేయడమే. నేను వెనకబడటానికి ఇదొక కారణమే’ అంటూ తన బాధలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది.

Read More: బ్రా అందాలను చూపిస్తూ.. కొండల్లో హాట్ అందాలను అరబోస్తున్న స్టార్ హీరోయిన్

Advertisement

Next Story