- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fahadh Faasil : పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు.. సుమోటోగా
దిశ, సినిమా: డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 లో విలన్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఫహాద్ కనిపించింది కొద్ది సమయమే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫహాద్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతడిపై సుమోటోగా కేసు నమోదయ్యింది అనే విషయం నెట్టింట హాట్ టాాపిక్‌గా మారింది.
అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఓవైపు హీరోగా, విలన్‌గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఫహాద్ ఇప్పుడు నిర్మాతగానూ మారి ప్రస్తుతం ‘పింకేలీ’ అనే మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతోపాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఒకవైపు రోగులకు చికిత్స జరుగుతుండగా మరోవైపు షూటింగ్ జరిగిందని దీంతో రోగులు వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్ర యూనిట్ అడ్డుకున్నారని. ఆసుపత్రిలో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడ ఉన్న రోగులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన నిర్మాతల సంఘం ఆసుపత్రిలో షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని తెలిపింది. అయితే ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఫహాద్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
- Tags
- Fahadh Faasil