- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పిల్లాడు ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా? 'హనుమాన్'పై ఫ్యాన్స్ డౌట్
దిశ, సినిమా: ఈ మధ్య ఏ చిన్న హీరో సినిమా అయినా పాన్ ఇండియా అని ప్రచారం చేయడం చూస్తున్నాం. చిన్న సినిమాగా రిలీజ్ అయిన 'కార్తికేయ 2' ఓ రేంజ్ కలెక్షన్‌తో దూసుకుపోయింది. ఇక 'హనుమాన్' సినిమా కూడా చిన్నగానే మొదలై భారీ పాపులారిటీ సంపాదించేలా కనిపిస్తోంది. విషయానికి వస్తే.. ఇదికూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అందులోనూ ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్‌ని చూస్తే కొన్ని గ్రాఫిక్స్ అదే రేంజ్‌లో కనిపిస్తున్నాయి.
అంత బాగానే ఉంది కానీ.. ఎటొచ్చి ఇక్కడ దెబ్బ కొడుతుంది. 'హనుమాన్' సినిమాలో హీరోగా ఎంచుకున్న తేజ సజ్జ గురించి. ఎందుకంటే అతని వయసుకి ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా? అని అనుమానాలు కలుగుతున్నాయి. మొదట ఈ సినిమా బడ్జెట్ రూ.16 కోట్లు అన్నారు. ఆ తర్వాత అది కాస్తా రూ.100 కోట్లు దాటింది. అటు చూస్తే కుర్ర హీరో.. ఇటు చూస్తే పెద్ద ప్రాజెక్టు.. దాదాపు వంద కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా మార్కెట్.. ఇవన్నీ తేజ మెయిన్‌టెన్ చేయగలడా? లేదా? అని అభిమానులు చర్చిస్తున్నారు.