- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: మన శోభనం ఎప్పుడో జరిగిపోయిందంటూ.. రాజ్ కి షాక్ ఇచ్చిన కావ్య
దిశ,సినిమా : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
మీరు నాతో రండి అంటూ రాజ్ ని, కావ్య శోభనం గదికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఓ వ్యక్తి మంచాన్ని రెడీ చేస్తుంటే.. ‘ఇదిగో బాబు.. ఏంటి ఇలా పూలు ఎలా పడితే వేస్తున్నావ్? ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు.. నీ బదులు మరో ఇంకో ఆయన వచ్చాడులే’ అని అంటుంది. దాంతో వాడు వెళ్లిపోతాడు. అది విన్న రాజ్.. ‘హేయ్..ఏమి మాట్లాడుతున్నావ్ నేను పనోడు నేను ఒకటేనా.. అయినా వాడితో నన్ను పోలుస్తున్నావ్.. నీ బదులుగా నేను వచ్చాను అని చెబుతున్నావ్?’ అని కోపంగా అంటాడు. ‘అయ్యో నేను అలా అనలేదండి.. మరోకరు వచ్చారు అని మాత్రమే కదా చెప్పాను’ అని కావ్య కావాలని అంటుంది.
రాజ్ పూల బుట్ట అందుకుంటూ.. ‘నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్’ అని అంటాడు. ‘ఆ.. ఆ.. నాకే అన్ని తెలివి తేటలు ఉంటే నా శోభనం స్టోర్ రూమ్‌లో ఎందుకు జరిగేది?’ అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అయినా రాజ్.. వెంటనే పూల బుట్ట పక్కన పెట్టేసి.. ‘ఏంటి మనకు శోభనం జరిగిపోయిందా?’ అంటూ కంగారు పడతాడు. ఒకరోజు రాజ్ మత్తులోనే కావ్య గదికి వెళ్తాడు. మత్తులోనే కావ్య ఉన్న స్టోర్ రూమ్‌లో నిద్రపోతాడు. ఇక అప్పటి నుంచి కావ్య ఆ విషయం గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరస్తుంది. శోభనం జరిగింది జరగలేదు అనే క్లారిటీ ఇవ్వకుండా రాజ్ ను ఆటపట్టిస్తుంటుంది.