- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: హీరో వచ్చేసాడు.. ఇక రాజ్ కి చుక్కలే
దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
కళావతి బావ.. స్టోరీ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అతను పలకరింపుగా రాజ్‌ని హగ్ చేసుకోబోతాడు. ‘హేయ్.. ఆగు నాకు హగ్గులన్నా, పెగ్గలన్నా అస్సలు నచ్చదు’ అని రాజ్ అంటాడు. ‘అదేంటి బుజ్జీ నేను రావడం మీ ఇష్టం లేదంటావా?’ అని కళావతి బావ అంటాడు. ‘అబ్బే.. అదేం కాదు.. నాది చాలా బ్రాడ్ మైండ్.. అసలే అబ్రాడ్‌లో చదివాను కదా.. అని రాజ్ అంటాడు. ‘అవునా.. పోనేలే అన్నయ్య.. కానీ మిమ్మల్ని చూస్తే నాకు జలసీగా ఉంది.. బుట్టబొమ్మని పెళ్లి చేసేకున్నారు మీరు.. మీరు పెళ్లి చేసుకోకపోతే.. నేను ఈ పాటికి పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుని పోయేవాడ్ని. ఆ స్వప్న పారిపోయినట్లే నా బుజ్జి కూడా పారిపోయి ఉండాల్సింది. అప్పుడు చాలా బాగుండేది’ అని కళావతి వాళ్ల బావ అంటాడు.
రాజ్ కి లోపల కాలిపోతూ ఉంటుంది, కానీ పైకి కనిపించకుండా నవ్వుతాడు రాజ్. కావాలని శ్వేత భుజం మీద చేయి వేసి.. ‘ఈమె ఎవరో తెలుసా.. నా నా క్లోజ్ ఫ్రెండ్’ అని రాజ్ పరిచయం చేస్తాడు. ‘హూ.. హాయ్’ అంటాడు కళావతి వాళ్ల బావ. ‘హాయ్’ అని అంటుంది శ్వేత. ‘ఎంతకాలం ఉంటారు మీరు? అని రాజ్ నవ్వుతూ అడిగేస్తాడు.. ‘నిజానికి ఒక వారం రోజులని ఉందామని వచ్చాను కానీ.. నా బుజ్జిని చూశాకా అసలు వెళ్లాలని లేదు. తను నన్ను ఇక్కడ ఎంతకాలం ఉండమంటే అంత కాలం ఇక్కడే ఉండిపోతాను’ అంటాడు కావ్య బావ. ఆ మాటలకు రగిలిపోతాడు రాజ్.
‘ పదా బుజ్జీ .. మనం చిన్ననాటి కబుర్లు చాలా చెప్పుకోవాలి ' అని అంటాడు కావ్య బావ. ‘సరే బావా పదా’ వెళ్దాం.. అని కావ్య కూడా అంటుంది కావ్య . వెంటనే రాజ్.. శ్వేత చేతిని తన చేతికి చుట్టుకుని.. ‘మేము కూడా కాలేజ్ రోజుల నుంచి.. చాలా కబుర్లు చెప్పుకోవాలి.. పదా శ్వేతా’ అంటూ తన క్యాబిన్ వైపు నడుస్తాడు రాజ్.ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.
Read More..
Guppedantha Manasu: మను గారితో నాకు సమ్మతమే.. అంటూ అందరికి షాక్ ఇచ్చిన వసుధార