Brahmamudi January 30th Episode: మారిపోయిన అపర్ణా దేవి.. షాక్ లో కావ్య

by Prasanna |   ( Updated:2024-01-30 10:06:01.0  )
Brahmamudi January 30th Episode: మారిపోయిన అపర్ణా దేవి.. షాక్ లో కావ్య
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రాజ్ వదిలేసి వెళ్లిపోవడంతో కావ్య కి ఏమి చేయాలో తెలియక క్యాబ్స్ కోసం చూస్తూ ఉంటుంది. అయితే అపర్ణా దేవి వెంటనే ఇంట్లోకి పిలిచి.. ‘హేయ్ ఇలారా .. ఏంటి అక్కడక్కడే తిరుగున్నావేంటీ? ఇంకా ఆఫీస్‌కి వెళ్లలేదా?’ అని అడుగుతుంది. ‘క్యాబ్స్ ఏమీ దొరకడం లేదు అత్తయ్యా’ అని కావ్య అంటుంది. ఆ పక్కనే కూరగాయలు కట్ చేస్తున్న ధాన్యలక్ష్మీ..ఈవిడ గారికి ‘షేర్ ఆటోలు అలవాటేగా’ దానిలో వెళ్తుంది.. అనవసరంగా కారు ఎందుకు దండగ అని అంటుంది. ఏమి మాట్లాడుతున్నావ్ ‘ఈ ఇంటి పెద్ద కోడలు హోదాలో.. తను ఎందులోనూ తక్కువ కాదు.. ఆగు ఇప్పుడే వస్తాను’ అంటూ కారు తాళం తెచ్చి ‘తీసుకో..నా కార్ తాళం.. నువ్వు ఆటోలో వెళ్ళాలిసిన అవసరం లేదు. నా కారులో వెళ్లు.. అంటూ బయట డ్రైవర్ యాదిగిరి ఉంటాడు. తీసుకెళ్లు’ అని అపర్ణా దేవి అంటుంది

‘వద్దులే అత్తయ్యా’ ఇప్పుడు ఎందుకు అని అంటుంది కావ్య.. ధాన్యలక్ష్మి రగిలిపోవడం చూసి. ‘ఎక్కువ మాట్లాడితే నీకు ఇంకా ఖరీదైన కారుని కొని దానిలో పంపిస్తాను. మొదటి సారి వెళ్తున్నావ్.. మంచిగా వెళ్లు.. సంతోషంగా వెళ్లు.. అక్కడ నువ్వు ఖరీదైన కారులోంచి దిగితేనే నీకు గౌరవంగా ఉంటుంది.

నా కోడలు కారులోనే వెళ్లాలి. అది నా గౌరవాన్ని కూడా పెంచుతుందంటూ.. కారు తాళం కావ్య చేతిలో పెడుతుంది అపర్ణా దేవి. అక్కడే కూర్చుని ఉన్న ఇందిరా దేవి.. ‘మంచి పని చేశావ్ అపర్ణా.. ఇది చూడటానికి ఇంత బావుందో.. అని చాలా సంతోషం' అని అంటుంది. ‘అమ్మమ్మగారు వెళ్లొస్తాను.. అత్తయ్యగారు వెళ్లొస్తాను’ అంటూ ఇద్దరి కాళ్లు మొక్కి ఇంటి నుంచి బయటకు వచ్చి కావ్య కారు ఎక్కుతుంది.

Advertisement

Next Story