బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, స్కాట్లాండ్‌లో ‘బడేమియా చోటే మియా’ షూటింగ్ పెట్‌లో టైగర్ ష్రాఫ్‌తో స్టంట్ సీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అక్షయ్ కుమార్‌ మోకాలికి గాయం అయినట్లు సమాచారం. దీంతో అది గమనించిన చిత్రబృందం అక్షయ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయం అంత తీవ్రంగా లేకపోయినా కొన్ని రోజులు యాక్షన్ సన్నివేశాలకు దూరం ఉండడం మంచిదని వైద్యులు తెలిపారు. దీంతో అక్షయ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం షూటింగ్ అలస్యం కాకూడదని గాయాలయినా సరే షూటింగ్‌లో పాల్గొని తన సీన్స్‌ను కంప్లీట్ చేశాడట. దీంతో అది తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ అక్షయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story