- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెగాస్టార్ మనుమరాలిలో ఇంత టాలెంట్ ఉందా?.. చిన్న ఏజ్‌లో బిజినెస్ టేకోవర్ చేసిందిగా?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలీ నందా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్-నిఖిల్ నందా దంపతుల సంతానమే ఈ నవ్యా. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. 21 ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. ఆల్రెడీ ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతోంది. తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయా బచ్చన్‌తో కలిసి ‘వాట్ ది హెల్ నవ్యా’ అనే వాడ్ కాస్ట్ కూడా చేస్తున్నారు. అయితే మెగాస్టార్ ఫ్యామిలీలో అంతమంది నటులున్నప్పటికీ ఈమె కూడా అదే బాటలో వెళ్తోందనుకుంటే.. విభిన్నంగా వ్యాపారాల వైపు అడుగులు వేస్తోంది.
నవ్యా తాజాగా విమెన్ సెంట్రిక్ హెల్త్ టెక్ అనే కంపెనీని స్థాపించింది. ఇది మహిళ సాధికారత కోసం తీసుకొచ్చిన ప్లాట్ ఫాం అని నవ్యా స్వయంగా వెల్లడించింది. విభిన్న భావాలు, నేపథ్యాలు కలిగిన ఇతర మహిళల్ని బలపర్చడం కోసం ఇది సహాయపడుతుందని, తన ట్రాక్టర్ బిజినెస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని, ‘మా ఎస్కార్ట్స్ కుబోటా ఫ్యామిలీ కస్టమర్లను, డీలర్లను, ఆన్ గ్రౌండ్ టీమ్స్‌ను కలిసేందుకు రాష్ట్రాలు చుడుతున్నామని నవ్యా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తన తండ్రితో కలిసి అడుగులు వేస్తోన్న ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది.