సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

by sudharani |
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటుడు సమీర్ కక్కర్ (71) కన్ను మూశారు. నిన్న ఉదయం నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండటంతో, ఈ రోజు ఉదయం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు సమీర్. ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ నటించిన మూకీ చిత్రం ‘పుష్పక విమానం’ లో ఆయన కీలకపాత్ర చేశారు. దీంతో పాటు.. పరింద, జై హో, మసూమ్, రాజా బాబు వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన ‘సర్కస్’ మూవీలో కూడా నటించారు.

Advertisement

Next Story