దళపతి విజయ్‌ లాస్ట్ సినిమాలో విలన్‌గా ఆ స్టార్ నటుడు!

by sudharani |
దళపతి విజయ్‌ లాస్ట్ సినిమాలో విలన్‌గా ఆ స్టార్ నటుడు!
X

దిశ, సినిమా: యానిమల్‌ చిత్రంలో తన నటనతో అన్ని వర్గాలకు, అన్ని భాషల సినీ ప్రేమికులకు దగ్గరయ్యారు నటుడు బాబీ డియోల్‌. ప్రస్తుతం ఈయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యానిమల్‌ చిత్రం సాధించిన విజయంతో బాబీ డియోల్‌కు వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. ఆయన తమ చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించమని కోరుతున్నారు. ఇప్పటికే బాబీ పలు చిత్రాలను అంగీకరించారు. త్వరలోనే ఆయన తమిళ కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రంలో విలన్‌గా నటించనున్నారని తెలిసింది. దీనికోసం చిత్ర యూనిట్‌ బాబీ డియోల్‌ను సంప్రదించిందని, ఇందుకు ఆయన అంగీకరించినట్లుగా తెలిసింది. ఈచిత్రంలో మునుపెన్నడూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో తను కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్‌ సరసన పూజా హేగ్డె కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్‌ అధికారికంగా తెలియజేస్తారు.

Advertisement

Next Story