- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Saripodhaa Sanivaaram: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అంతేకాకుండా ‘సరిపోదా శనివారం’ రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. దీంతో నాని అభిమానులు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘సరిపోదా శనివారం’ డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 26 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇప్పటి వరకు రెండు కళ్లే చూశారు. మూడో కన్ను చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు. దీంతో అది చూసిన నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.